విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి,

TEJA NEWS

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి, సమ్మె విరమింప చేయడానికి ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలి….

ఐ కృష్ణ. ఐఎఫ్టీయు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు….

పెద్దపల్లి// అత్యవసర సర్వీస్ అయిన విద్యుత్ శాఖలో ఉన్న ట్రాన్స్కో జన్కో ఉత్తర దక్షిణ డిస్కం కంపెనీల లో పనిచేస్తున్న సుమారు 20వేల మంది ఆర్టిజన్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 8 నుండి నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు.

వీరి సమస్యలను తక్షణమే ప్రభుత్వ పరిష్కరించాలని కోరుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ.మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు ముందు నెలల తరబడి తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి సంబంధిత శాఖ ఉన్నత అధికారులకు విజ్ఞప్తులు విన్నపాలు చేసి వినతి పత్రాలు సమర్పించారు.

అయినా ప్రభుత్వం వైపు నుండి కానీ సంబంధిత శాఖ అధికారుల వైపు నుండి కానీ ఎలాంటి స్పందన రాలేదు, ఫలితంగా ఉద్యోగులు విధిలేని పరిస్థితులు సమ్మెలోకి వెళ్ళవలసి వచ్చింది.

ఆర్టిజన్ ఉద్యోగులు ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లు కొత్తవి కావు గొంతెమ్మ కోరికలు అంతకంటే కావు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలు కూడా వాటిని అమలు చేయమని ఉద్యోగులు కోరుతున్నారు.
వారు కోరుతున్న డిమాండ్లలో

1.విద్యా అర్హతలను బట్టి ఆర్టిజన్ ఎంప్లాయిస్ ను కన్వర్షన్ చేసి ఏపీఎస్ఈసి రూల్స్ వర్తింపజేసి అమలు చేయాలి.

2.టీజీ ఎంపీడీసీఎల్ పీజీ ఎస్పీడీసీఎల్ లో విలీనం చేయాలి.3. 2016 డిసెంబర్ 4 ముందు అన్ని అర్హతలు కలిగి ఉన్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆర్టిజన్ లుగా గుర్తించాలి.

  1. పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలి, అదన భారాన్ని మోస్తున్న బిల్ కలెక్టర్లకు గృహ జ్యోతి పథకం ద్వారా ఆదుకొని 30 రోజుల పని దినాలు కల్పించాలి.

విద్యుత్ ఉద్యోగులు కోరుతున్న ఈడిమాండ్లు అత్యంత న్యాయమేనవి. రాజ్యాంగ బద్ధమైనవి కూడా, డిమాండ్లు చట్టబద్ధంగా పొందవలసిన హక్కులు. అందువలన ఆర్టిజన్ ఉద్యోగుల సానుకూలంగా పరిశీలించి, పరిష్కరించడానికి ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని, ఉద్యోగులకు నాయకత్వం వయిస్తున్న జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి, చర్చలు జరపాలని డిమాండ్ల పరిష్కారానికి పూనుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, జిల్లా నాయకులు ఐ రాజేశం, ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు కిషన్ రెడ్డి ,కే రమేష్, ఎస్ రవి, ఎస్ శ్రావణ్ కుమార్, సురేష్, అశోక్, రమేష్, మల్లేష్. తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top