చట్టసభలో 33% మహిళల రిజర్వేషన్ బిల్లు

TEJA NEWS

చట్టసభలో 33% మహిళల రిజర్వేషన్ బిల్లు హర్షణీయం….

–బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య…

పెద్దపల్లి//గోదావరిఖని: చట్టసభలో ‌లో 33% మహిళల రిజర్వేషన్ ఒక అత్యంత అవసరమైన, సముచితమైన నిర్ణయం ఆని బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య హర్షం వ్యక్తం చేసారు.

ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ, మన దేశంలో మహిళలు జనాభాలో సగానికి పైగా ఉన్నప్పటికీ, రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందఆని ఈ అసమానతను సరిచేయడానికి 33% రిజర్వేషన్ ఒక కీలక అడుగు ఆని అన్నారు.

మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాదు, వారు సమాజ నిర్మాణంలో, ఆర్థిక అభివృద్ధిలో, నిర్ణయాల తీసుకోవడంలో సమాన పాత్ర పోషించగలరని, పార్లమెంట్‌లో వారికి సరైన స్థానం కల్పిస్తే, మహిళల సమస్యలు మరింత సమర్థంగా పరిష్కారం పొందుతాయని, మెరుగైన పాలన అందించే దిశగా అడుగులు వేస్తారు అని బీజేపీ మహిళా నాయకురాలు సోమారపు లావణ్య- అరుణ్ కొనియాడారు.

ఈ బిల్ చట్ట సభల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 13,14,15 తేదీలలో బిల్ ప్రవేశ పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు, మహిళా అందరూ మన దేశ ప్రధాని నరేంద్రమోదీ కి కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాం ఆని అన్నారు.

ఏనో ఏళ్ల నుంచి ఏ రాజకీయ పార్టీ తీసుకొని నిర్ణయం బీజేపీ తీసుకోవడం గర్వంగా వుంది అని తెలియచేసారు.అదే విధంగా బీజేపీ రాష్ట్ర పార్టీ సూచనల మేరకు రాబోయే రిజర్వేషన్ బిల్ ప్రోగ్రామ్స్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.

You cannot copy content of this page

Scroll to Top