రోడ్డు ఆక్రమణలను తొలగించండి.

TEJA NEWS

రోడ్డు ఆక్రమణలను తొలగించండి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

.చింతల్ సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా సిపిఐ నాయకులు డిప్యూటీ కమిషనర కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగద్గిరిగుట్ట 280 డివిజన్లో జగద్గిరిగుట్ట మెయిన్ రోడ్డు మరియు అవుట్ పోస్టునుండి హెచ్ఎంటి వెళ్లేదారిలో రోడ్డు విస్తరణ సందర్భంగా మిగిలిన భూమిలో షెడ్లు వెయ్యడం వల్ల వాహనాలను రోడ్డుపైన పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ ఏర్పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతుందని గతంలో కొన్నిచోట్ల కూల్చివేతలు జరిగినప్పటికీ తిరిగి మళ్లీ వేసుకుంటున్నారని కావున వెంటనే తొలగించి ఫుట్పాత్ ను వేయాల్సిందిగా కోరడం జరిగింది.

అదేవిధంగా బీరప్ప నగర్ నుండి మగ్దుమ్ నగర్కు వేసిన రోడ్డు వల్ల సుమారు 10 ఫీట్ల వరకు స్థలం మిగిలిపోయిందని ఆ మిగిలిన స్థలం అక్కడి వారికే కేటాయిస్తామని చెప్పి కొంతమంది డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం ఉందని అలాంటిది జరగకుండా గతంలో సిపిఐ పార్టీగా వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు లేదని ఇప్పటికైనా ఆ మిగిలిన స్థలంలో చెట్లను నాటి ప్రతి శుక్రవారం జరిగే మార్కెట్ను ఇక్కడ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు జిల్లా కౌన్సిల్ సభ్యులు నరసింహారెడ్డి ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు సిపిఐ నాయకులు కృష్ణ, ఇమామ్, సామెల్, రవి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top