బుచ్చి మార్కెట్ కాంప్లెక్స్ చంద్రబాబు నాయుడు కి అంకితం

TEJA NEWS

బుచ్చి మార్కెట్ కాంప్లెక్స్ చంద్రబాబు నాయుడు కి అంకితం

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

సంపన్నులను సమాజసేవలో భాగస్వాములు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పి4 సంకల్పానికి ​బుచ్చిరెడ్డిపాళెం పట్టణ మార్కెట్ కాంప్లెక్స్‌ సజీవసాక్ష్యమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ​బుచ్చిరెడ్డిపాళెం పట్టణానికి విచ్చేసిన వారుముందుగా ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణీకులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తో మాట్లాడుతూ గతంలోలా చెన్నూరు బస్టాండ్ వద్ద బస్సులు ఆపే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చెన్నూరు బస్టాండ్ ను సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా బస్సులు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు.

పి4 కార్యక్రమంలో భాగంగా నిర్మించిన నూతన మార్కెట్ కాంప్లెక్స్‌ను సందర్శించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని బుచ్చిరెడ్డిపాళెం వాసుల దశాబ్దాల కలగా మిగిలిన మార్కెట్ కాంప్లెక్స్‌ ను మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామన్నారు. తేజో డెవలపర్స్ సహకారంతో నిర్మించిన ఈ ఆధునిక మార్కెట్ కాంప్లెక్స్ భవిష్యత్తులో పట్టణ ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండబోతోందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి పాళెం మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, మోర్ల మురళి, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, బుచ్చి మండల అధ్యక్షుడు గుప్తా శ్రీనివాసరావు, బెజవాడ జగదీష్, కె.వి శేషయ్య, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top