
నారా లోకేష్ తో కలిసి రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లును ఆమోదించినందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి, యువ నాయకులు నారా లోకేష్ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం ఈ మేరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతిని కలిసిన నారా లోకేష్ తో కలిసి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ఎంపీలు పాల్గొని రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కోట్ల ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం తమకు దక్కిన ఒక గొప్ప అవకాశంగా అభివర్ణించారు. రాజధానిపై ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్పష్టతను తీసుకురావడంలో రైతుల అసాధారణ పట్టుదల, త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కొనియాడారు.