ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దుకాణాలకు నిర్దేశిక గడువులోపు దరఖాస్తు ఇల్చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్

TEJA NEWS

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దుకాణాలకు నిర్దేశిక గడువులోపు దరఖాస్తు ఇల్చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

వనపర్తి : వనపర్తి టౌన్‌లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో ఉన్న దుకాణాలు, సూపర్ మార్కెట్ మరియు బ్యాంక్వెట్ హాల్‌ లను పారదర్శకంగా, లాటరీ పద్ధతి ద్వారా కేటాయించనున్నట్లు, ఆసక్తి గలవారు నిర్దేశిత గడువులోపు దరఖాస్తు చేసుకోగలరని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు.

ఈ లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పరిపాలన చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తం 32 షాపులు అందుబాటులో ఉండగా, బ్యాంక్, సూపర్ మార్కెట్‌తో పాటు ఫస్ట్ ఫ్లోర్‌లో బ్యాంక్వెట్ హాల్ కూడా లాటరి ద్వారా కేటాయించబడనున్నట్లు తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు 18-04-2026 సాయంత్రం 5.00 గంటల వరకుగా నిర్ణయించబడింది. దరఖాస్తు ఫారం పొందడానికి ఫీజు రూ.2,500/-గా నిర్ణయించబడింది. దరఖాస్తు ఫారం పొంది అప్లై చేసుకునేవారు దరఖాస్తు ఫారం తో పాటు నిర్దేశిత డీడీ ని కూడా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. దుకాణాలకు రూ.15,000/-గా ఉండగా, బ్యాంక్వెట్ హాల్‌కు ఈఎండీ రూ.50,000/- మరియు బ్యాంక్ & సూపర్ మార్కెట్‌కు ఈఎండీ రూ.25,000/-గా నిర్ణయించబడింది.

లాటరీ నిర్వహణ తేదీ 21-04-2026 ఉదయం 11.00 గంటలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.

డిమాండ్ డ్రాఫ్ట్ Secretary, AMC, Wanaparthy Town పేరున తీసుకుని రావలెను. షాపుల కేటాయింపు (32) షాపులలో జనరల్ కేటగిరి (16) షాపులు, బి.సి కేటగిరి (08) షాపులు, యస్.సి.కేటగిరి (05) షాపులు, యస్.టి కేటగిరి (02) షాపు, మరియు పి.హెచ్.సీ కేటగిరి (01) మొత్తం 32 షాపులు కలవు Lottery పద్ధతి ద్వారా జరుపబడును. కేటాయింపులో నిబంధనలు షరతులు మరియు ఇతర వివరముల కొరకు కార్యాలయపు పనివేలలో నేరుగా కాని లేదా సెల్ నెంబర్లు | 7330733292 మరియు 7893633678 ఫోన్ చేసి తెలిసుకొనవలసిందిగా విజ్ఞప్తి.

You cannot copy content of this page

Scroll to Top