
ఉత్తమ ర్యాంకులు సాధించిన జాగృతి విద్యార్థులను సన్మానించిన
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
వనపర్తి
రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకు, ఉమ్మడి జిల్లా 1వ ర్యాంకును సాధించిన జాగృతి విద్యార్థులను ఘనంగా సన్మానించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిగారు .ఐపిఈ 2026 ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలలో పట్టణంలోని జాగృతి కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో I బైపిసి లో ఉజ్మా హజారా 438/440 మార్కులతో 2వ ర్యాంకును, అదే విధంగా II బైపిసి లో హెచ్.అనుష్ణ 994/1000 మార్కులతో ఉమ్మడి జిల్లా మొదటీ ర్యాంకును సాధించి మరొకసారి వనపర్తిలో ప్రతిభ చాటారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి జాగృతి కళాశాలకు వచ్చి స్టేట్ ర్యాంకర్లను ఘనంగా సన్మానించారు. ఈ సంధర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో కార్పొరేట్ స్థాయి మార్కులతో , స్టేట్ ర్యాంకులను, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఫస్ట్ ర్యాంకులను సాధిస్తూ ఉమ్మడి జిల్లాలో అద్బుతమైన ఫలితాలు సాధిస్తున్నందుకు జాగృతి కళాశాల విద్యార్థులను అభినందించారు.
అదే విధంగా జేఈఈ మెయిన్-2026 సెక్షన్-I ఫలితాలలో సిహెచ్.అర్జున్ 91.69 పర్సంటైల్ తో జిల్లాలో అగ్రగామిగా నిలవడం జరిగింది అని కొనియాడారు జిల్లాలో ఇంటర్ విద్యలో ఐపిఈ మార్కులతో పాటు జేఈఈ, నీట్, ఎంసెట్ లలో కూడా కార్పొరేట్ కళాశాలలకు దీటుగా జాగృతి కళాశాల నిలవడం ఎంతో సంతోషంగా ఉంది అని జాగృతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంబటి వినోద్ కుమార్ ని యజమాన్య సభ్యులు భాస్కర్ , శ్యామ్ కుమార్ , సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీఅధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్ , వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ NSUI అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, సీనియర్ నాయకులు నందిమల్ల రామ్ ,ఎంట్లరవి, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు యజమాన్య సభ్యులు, అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.