హిందూ జన జాగృతి సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కమిటీ ఏర్పాటు….

TEJA NEWS

హిందూ జన జాగృతి సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కమిటీ ఏర్పాటు….


పెద్దపల్లి//గోదావరిఖని: హిందూ జన జాగృతి సమితి ఆధ్వర్యంలో ఆదివారం జరిగే, కాకతీయ మండపం, గౌతమ్ నగర్ బస్తీలోని హనుమాన్ ఆలయంలో, హిందూ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించి ముఖ్య సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్ ) ప్రముఖులు ప్రశాంత్ , మధుకర్ ,జనార్దన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహణ కోసం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోడం జరిగింది .

ఈ సందర్భంగా రాబోయే ఏప్రిల్ 21న. సాయంత్రం 5:00. గంటలకి గౌతమినగర్ సాయిబాబా ఆలయం పక్కన ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు.

కమిటీ అధ్యక్షుడిగా కొమరెవెల్లి సుధాకర్‌ను ఎన్నుకోగా, ప్రధాన కార్యదర్శిగా ముప్పు భాస్కర్, కోశాధికారి గా ఎం.వెంకటి ,ఉపాధ్యుక్ష్యులు గా జిమ్మిడి రాజ్ కుమార్, పూలూరి మహేందర్, ఇదునూరి మల్లేష్, పొన్నం రజిత, రాజ్‌కుమార్, ఉపులేటి శ్రీనివాస్, అజయ్, చెమిలీ రాజ్‌కుమార్ తదితరులను నియమించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,
ప్రధాన వక్త తూర్పాటి చంద్రశేఖర్,
హృషికేశ దాస్, ఇస్కాన్ ప్రచారకులు
మహిళ సమన్వయ కార్యకర్త
సూర్యదేవర జ్యోతి హాజరు కానున్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ, హిందూ సమ్మేళనం ద్వారా హిందూ సమాజంలో ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గౌతంనగర్, కాజిపల్లి, మాతంగి కాలనీ, శాంతినగర్, ప్రగతినగర, హనుమానగర్, చైతినపుర, ఎక్సర్వీస్ కాలనీ హిందూ బందువు లు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రతియొక్క హిందూ వులు పాల్గొనాలని తెలియచేసారు.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయం అధ్యక్షులు కొమెరెవెల్లి లింగమూర్తి ,సోమారపు లావణ్య ,హరిసింగ్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top