హసన్పర్తిలో డీసీసీ బ్యాంక్ నూతన బ్రాంచ్ ప్రారంభం – గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు

TEJA NEWS

హసన్పర్తిలో డీసీసీ బ్యాంక్ నూతన బ్రాంచ్ ప్రారంభం – గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం : ఎమ్మెల్యే నాగరాజు ..

హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమానికి మరో కీలక అడుగు పడింది. సోమవారం హసన్పర్తి మండల పరిధి లోని పి.ఏ.సి.ఎస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన హసన్పర్తి డీసీసీ బ్యాంక్ బ్రాంచ్‌ను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ వాజ్పేయి, ఎంపీ శ్రీమతి కడియం కావ్య , KUDA చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ…

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఈ నూతన బ్రాంచ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు, డిపాజిట్ సేవలు మరియు ఇతర ఆర్థిక సౌకర్యాలను పొందేందుకు ఈ బ్రాంచ్ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో డీసీసీ బ్యాంకులు ప్రధాన వనరులుగా పనిచేస్తాయని, రైతులు ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని తమ వ్యవసాయ మరియు ఉపాధి కార్యకలాపాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు సూచించారు….

ఈ కార్యక్రమంలో డిసిసిబి బ్యాంక్ సీఈవో వజీర్ సుల్తాన్, పిఎసిఎస్ ఇంచార్జ్ జగన్మోహన్ రావు, డిసిసిబి DD రవీందర్ , ఏవో అనురాధ, ఆత్మకూరు ఏఎంసీ వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి, మండల గ్రామస్థాయి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు….

You cannot copy content of this page

Scroll to Top