దేవుడు మాన్యం భూములను సోలార్ ప్లాంట్ కు ఇవ్వొద్దని రాష్ట్ర కమిషన్కు ఫిర్యాదు చేసిన కౌలు రైతులు

TEJA NEWS

దేవుడు మాన్యం భూములను సోలార్ ప్లాంట్ కు ఇవ్వొద్దని రాష్ట్ర కమిషన్కు ఫిర్యాదు చేసిన కౌలు రైతులు

సోలార్అనుమతులను రద్దు చేయకుంటే కౌలు రైతులతో కలిసి ఆందోళన చేపడుతామని హెచ్చరించిన……….. మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మహేష్ రెడ్డి
…..

వనపర్తి :

వనపర్తి మండలంలోని సవాయిగూడెం గ్రామంలో అంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన సర్వేనెంబర్ 117 దేవుడు మాన్యం పది ఎకరాలకు పైగా భూములను గత కొన్ని ఏళ్లుగా గ్రామ రైతులు ఎవరు ఎక్కువగా కౌలును చెల్లిస్తారో వారు దేవుడు మాన్యం భూములను గ్రామ సమీపంలోని చెరువు, ద్వారా అలాగే డి-8 కాల్వ పనులు పూర్తయ్యాయని భవిష్యత్తులో కాలువ నీటి ద్వారాసాగు చేసుకునిపంటలు పండించుకుని గుడికి కౌలును చెల్లించే వారని కౌలు ద్వారా వచ్చిన సొమ్ముతో దేవుడి నిర్వహణ ఖర్చులకు ఉపయోగిస్తూ వస్తున్నారని కొంతమంది గ్రామనికి చెందిన నాయకులు సంబంధిత శాఖ అధికారులతో కుమ్మక్కై సాగు చేస్తున్న భూములను నిరుపయోగంగా ఉందని దేవాదాయ శాఖకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో అక్కడ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం జరిగిందని కానీ గత కొన్నేళ్లుగా ఎండోమెంట్ భూముల పై రైతు కూలీలు కౌలు రైతులు దాదాపుగా వందమంది జీవనం సాగిస్తున్నారని అసలు నిబంధనల ప్రకారం సాగులో ఉన్న భూములను కమర్షియల్ కోసం ఇవ్వకూడదన్న దేవాదాయ శాఖ నిబంధనలను పక్కన పెట్టడంతో దాదాపుగా 25 సంవత్సరాల కు పైగా దేవుడు మాన్యం భూములను సోలార్ ప్లాంట్ కోసంలీజుకి ఇవ్వడం జరుగుతుందని అలా జరిగితే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు సోలార్ ప్లాంట్ ఏర్పాటు అనుమతులు రద్దు చేయాలని దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగిందని అలాగే ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని కానీ వనపర్తి జిల్లా ఈవో ఆంజనేయులు మాత్రం తమ దృష్టికి ఇంతవరకు ఎవరు తీసుకురాలేదని తెలపడం దారుణమని దేవుడు మాన్యం భూముల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు కొనసాగితే కౌలు రైతులు రైతు కూలీలు వ్యవసాయ జీవనాధారమైన దీర్ఘకాలికంగా బృతిని కోల్పోతారని అక్కడ సోలార్ అనుమతులను పనులను ఆపకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని వనపర్తి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మహేష్ రెడ్డి హెచ్చరించారు.

You cannot copy content of this page

Scroll to Top