బిజెపి ఆధ్వర్యంలోమహిళా బిల్లును వ్యతిరేకించిన ఇండికూటమి నాయకుల దిష్టిబొమ్మ ల దగ్ధం

TEJA NEWS

బిజెపి ఆధ్వర్యంలోమహిళా బిల్లును వ్యతిరేకించిన ఇండికూటమి నాయకుల దిష్టిబొమ్మ ల దగ్ధం

ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఇంటి ముందు దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తా మనీ హెచ్చరించిన
బిజెపి జిల్లా అధ్యక్షులు డి.నారాయణ
….

వనపర్తి :
పార్లమెంటులో మహిళా బిల్లును అడ్డుకున్న ఇండికూటమినేతలు రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరియు తెలంగాణ 8 మంది కాంగ్రెస్ ఎంపీల దిష్టిబొమ్మలను బిజెపి ఆధ్వర్యంలో సోమవారం రాజీవ్ చౌరస్తాలో దహనం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు డి.నారాయణ మాట్లాడుతూ మహిళా బిల్లు అమలుకై రాజ్యాంగ సవరణ జరిగితే మహిళా బిల్లుతో పాటు డిలిమిటేషన్ బిల్లు ద్వారా 543 తోపాటు 273 కొత్త స్థానాలతో 816 స్థానాలు అయ్యేవని నాటి కౌరవసభలో ద్రౌపది వస్త్రాపహరణంలో కౌరవులు శునకానందం పొందిన విధంగానే నేడు పార్లమెంటులో మహిళా బిల్లు అడ్డుకున్నారని ఇది కేవలం తాత్కాలికమేనని చరిత్రలో ఎప్పుడు కూడా గెలుపు ధర్మం వైపే ఉంటుందని భారతంలో కౌరవుల మాదిరి రాబోయే ఎన్నికల్లో 50% జనాభా కలిగిన మహిళల చేతుల్లో ఇండికూటమినేతలకు ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాధిలో జనాభా పరంగా సిట్లు కోల్పోతామని అడ్డగోలు వాదన చేస్తున్నారని దక్షిణాదిలో జనాభా తగ్గడానికి నాడు ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో కేవలం హిందూ మతానికి చెందిన పురుషులను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కారణంగానే హిందూ జనాభా తగ్గిందని అయినా దేశవ్యాప్తంగా 50% సీట్లు పెంచినప్పుడు జనాభా లెక్క ఉత్పన్నం కాదనే బుద్ధి రేవంత్ రెడ్డికి లేదని వాజ్ పాయ్ హయాంలో ఉత్తరఖండ్ ఛత్తీస్ ఘడ్ జార్ఖండ్ రాష్ట్రాలు వివాదాల్లేకుండా ఆత్మహత్యలు లేకుండా ఆవిర్భవించాయని తెలంగాణ రాష్ట్ర మాత్రం 1400 మంది బలిదానాలతో ఏర్పాటు చేశారన్న ఎంపీ తేజస్వీ సూర్య మాటలను వక్రీకరించి వనపర్తి కాంగ్రెస్ నాయకుడు బీజేపీ ఎంపీల ఫోటోలను దగ్ధం చేశారని అధికారంలో ఉన్నామని పోలీసుల అండ చూసుకొని అడ్డగోలుగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని మీరు గల్లీలో దగ్ధం చేస్తే మేము రాజీవ్ చౌరస్తాలో ఇండికూటమినేతలు రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఎంపీలు ఫోటోలు దగ్ధం చేసామని మేము తలుచుకుంటే ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి ముందు దిష్టిబొమ్మ దగ్ధం చేసే దమ్ము ధైర్యం ఉందని మరొక్క మారు బిజెపి నాయకుల పై కవ్వింపు చర్యలకు పాల్పడితే వనపర్తి కాంగ్రెస్ నాయకుల ఇల్లు ముట్టడించి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి రామన్నగారి వెంకటేశ్వర్రెడ్డి కేతూరి బుడ్డన్న జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు వారణాసి కల్పన ఉపాధ్యక్షులు పద్మమ్మ జిల్లా కార్యదర్శి కాటమోని కృష్ణ గౌడ్ కౌన్సిలర్ శ్రీమతి డి. నిర్మలమ్మ ఎం విజయ్ సాగర్ మాజీ జిల్లా కార్యదర్శి బొయెల్ల రాము పార్లమెంట్ మాజీ కో కన్వీనర్ దాసరాజు ప్రవీణ్ మాజీ సర్పంచ్ ఎద్దుల దేవేందర్ జిల్లా కార్యవర్గ సభ్యులు ద్వారపోగు సుబ్రహ్మణ్యం సీనియర్ నాయకులు ద్వారపోగు నారాయణ సూర్యవంశం శీను కంటెస్టెంట్ కౌన్సిలర్స్ గోపీనాథ్ ఆచార్య గంధం బాలపీరు సత్య తిరుపతి యాదవ్ పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి నల్లబోతుల అరవింద్ కోశాధికారి కూన శ్రీకాంత్ యువమోర్చా అధ్యక్షుడు ఎద్దుల రాజు కార్యదర్శి చినరాయుడు కడమంచి శివ చంద్రశేఖర్ చాణక్య తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top