
నారాయణపురం లో ఘనంగా పోషణ్ పక్వాడ్ కార్యక్రమం…*సూపర్వైజర్ సునీత….
చిలుకూరు మండలం నారాయణపురం లో పోషణ పక్వాడ్ లో కార్యక్రమంలో పాల్గొన్న సూపర్వైజర్ సునీత, టీచర్లు
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ్ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సునీత మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల నుండి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించనున్నట్లుగా తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.