ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే

TEJA NEWS

ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే బొల్లం

కోదాడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన వచ్చి – రెండు సంవత్సరాలు పూర్తయింది ఆర్టీసీ సిబ్బంది రెండున్నర ఏళ్లుగా ఓపిక పట్టి సమ్మెకు దిగాల్సి పరిస్థితి వచ్చిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచి తన సంఘీభావాన్ని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న పొన్నం ప్రభాకర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే కార్మికులు అడుగుతున్నారు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.మేధావులు ఏం చేస్తున్నారు, కోదండరామిరెడ్డి లాంటి వ్యక్తులు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మాట్లాడకపోవడం బాధాకరం
పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు ఎందుకు ఉన్నాయి , మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఆర్టీసీ సిబ్బందిపై ఒత్తిడి పెంచారు. అలాగే పక్క రాష్ట్రం అయినా ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు.

అలాగే ఇక్కడ ఎందుకు చేయరు.దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి గతంలో ఆర్టీసీ సంస్థకు రావలసిన 200 కోట్ల చెక్కు ఇచ్చారు. దానికి దిక్కు లేదు రేవంత్ ఇచ్చిన చెక్ ఇప్పటికి చెల్లలేదు గతంలో మా బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బస్సులే జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. సర్వీస్ అయిపోయిన బస్సులు తీసివేసి కొత్త బస్సులు తేవాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటే కార్మికులు ఎందుకు సమ్మె చేస్తారు. కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోతే ఆర్టీసీ సమ్మెకు బీ ఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుంది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంతా పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top