విధుల్లో ఆరోగ్యం అత్యంత ముఖ్యం…

TEJA NEWS

విధుల్లో ఆరోగ్యం అత్యంత ముఖ్యం…

–ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్లద్దాలు పంపిణీ చేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా…

పెద్దపల్లి//రామగుండం: ఎండాకాలంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చలువ కళ్లద్దాలను పంపిణీ చేశారు.

రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ, ఎండ వేడిమి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై ఎక్కువ సమయం విధులు నిర్వర్తించే ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ చలువ కళ్లద్దాలను అందజేస్తున్నామని తెలిపారు.

అలాగే, సిబ్బంది ప్రతి ఒక్కరి పనితీరును స్వయంగా తెలుసుకుని, విధుల్లో గానీ వ్యక్తిగతంగా గానీ ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎండ ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు తరచుగా నీళ్లు తాగుతూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని అన్నారు.

ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, ఆర్‌.ఐ. రమేష్, ఎస్‌.ఐ. హరిశేఖర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top