పెద్దపల్లిలో స్టాంప్ పేపర్లకు అధిక ధరలు..

TEJA NEWS

పెద్దపల్లిలో స్టాంప్ పేపర్లకు అధిక ధరలు….

అధిక ధరలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..

ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ సబ్ రిజిస్ట్రార్‌ వద్ద వినతిపత్రం…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో స్టాంప్ పేపర్లను ఎం.ఆర్.పి కన్నా అధికంగా విక్రయిస్తున్న ఘటనపై ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ సబ్ రిజిస్ట్రార్ తిరుపతి నాయక్ (SRO) గారికి వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రంలో, స్టాంప్ పేపర్ల అధిక ధరల కారణంగా వినియోగదారులు ఆర్థిక నష్టానికి లోనవుతుందని, రుణాల నమోదు, భూముల కొనుగోలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అవసరమైన నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్ల విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

మద్దెల దినేష్ తెలిపారు, కొన్ని స్టాంప్ పేపర్లను ఎం.ఆర్.పి కన్నా 30–50 శాతం ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు స్పందించడం లేదని, ఇది వినియోగదారులకు ఆవేదన కలిగిస్తున్నదని. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం, స్టాంప్ వెండర్లు ప్రజా సేవకులు కాబట్టి, అధిక ధరలు వసూలు చేస్తే లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసులు, అవినీతి నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవచ్చని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు లెనిన్, శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top