
భారీ షెడ్ల నిర్మాణాలు పట్టించుకోని అధికారులు
తేజ న్యూస్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ అతి సమీపంలో భారీ షెడ్లు నిర్మాణం జరుగుతుంటే అధికారులకి మాత్రం ఏమి కనిపించట్లేదు, అక్రమ షెడ్లు నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావస్తున్న ఇంతకాలం అధికారులకి తెలీదా తెలిసి తెలినట్టు వ్యవహారిస్తున్నారా, ఏది ఏమైన అధికారులు తమ చేతి వాటం చూపుతున్నారు అని అంటున్న స్థానికులు, షెడ్లకి అనుమతులు లేకపోయినా మేము ఏమి చేసిన చలుతుంది అని,మమల్ని ఎవరు ప్రశ్నిస్తారు అనే ధోరణి అధికారులలో కనిపిస్తుంది అంటున్న స్థానికులు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలకి సహకరించి ఒక కింది స్థాయి అధికారి బంగ్లాలు విలాలు అని కోట్లు సంపాదించారాని స్థానిక ప్రజలు అంటున్నారు,ఒక కింది స్థాయి అధికారి అంత అర్జిస్తే పై స్థాయి అధికారులు ఎంత సంపాదిస్తారో అనే ప్రశ్న కూడా వస్తుంది,ఏది ఏమైనా అధికారులు ఇలాంటి అక్రమ షెడ్ల పైన తక్షణమే చర్యలు చేపట్టి వారి పైన చర్యలు తీసుకోవాలి అని అక్కడి ప్రజలు కోరుతున్నారు, మామూళ్లు మత్తులో ఉన్న అధికారులు చర్యలు తీసుంటారా అంటున్న ప్రజలు,దొమ్మర పోచమ్మపల్లి లో దుండిగల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రెండు ఎదురు ఎదురు షెడ్ల పై, మరియు గండి మైస్సమ్మ మెయిన్ రోడ్డు పైన పెట్రోల్ బంక్ పక్కన నిర్మిస్తున్న భారీ షెడ్ల పై ఎలాంటి చర్యలు ఉంటాయో చూద్దాం

