
స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎంవీఐ
తిరుపతి / శ్రీకాళహస్తి: పట్టణంలోని ఓ ప్రయివేటు స్కూల్ బస్సులను శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి.దామోదర నాయుడు తనిఖీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి గాను బస్సుల కండీషన్లు, ఫిట్ నెస్ , సంబంధిత పత్రాలను పరిశీలించారు. విద్యార్థులకు సంబంధించిన బస్సుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మేనేజ్మెంట్ కు తెలిపారు. విద్యార్థులతో కూడిన బస్సులు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్లకు సూచించారు. రాబోవు విద్యా సంవత్సరానికి వేసవి సెలవుల్లోనే బస్సుల కండీషన్లు, రిపేర్లు పట్ల మేనేజ్మెంట్ జాగ్రత్త వహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది పాల్గొన్నారు.