
కేంద్రం నిర్లక్ష్యంతో 22 లక్షల విద్యార్థులకు శాపం
** ఎన్టీఏకి “నీట్” పరీక్షల బాధ్యతే పెద్ద తప్పు
** మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
….
తిరుపతి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే దేశంలో “నీట్” పరీక్ష రాసిన 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, మానసిక పరిస్థితి గందరగోళంగా మారిందని సిడబ్ల్యుసి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గౌడపేరు చిట్టిబాబు, యార్లపల్లి గోపిలతో కలసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోడీ ఈవెంట్లు నిర్వహించడంలో అందవేసిన చేయని ఎద్దేవా చేశారు. పరీక్షలకు ముందు విద్యార్థులను పిలిపించుకుని ఏకాగ్రతతో చదవాలని, ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలని విద్యార్థుల భుజం తట్టి చెప్పడం పరిపాటిగా మారిందన్నారు. అయితే దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కాకుండా ఆపడం కేంద్రానికి చేతకాలేదన్నారు. నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అవడం వెనుక బిజెపి యువమోర్చా నేతల ప్రధాన భాగస్వామ్యం ఉందని ప్రచార మాధ్యమాల ద్వారా తెలుస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు 89 సార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని ఆయన మండిపడ్డారు.
ఇందులో 48 సార్లు ప్రశ్నాపత్రాలను తిరిగి ముద్రించి పరీక్షలు నిర్వహించారన్నారు. గతంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో ఎంతో పగడ్బందీగా నీట్ పరీక్షలు జరిగేవని ఆయన చెప్పారు. అలా కాకుండా ప్రైవేట్ ఏజెన్సీకి నీట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో 140 ప్రశ్నలకు గాను 130 ప్రశ్నలు లీకయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. నీట్ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ ఎవరి పర్యవేక్షణలో ఉందో, దానిని ఎవరు నిర్దేశిస్తున్నారో, నియంత్రిస్తున్నారు అర్థం కాని పరిస్థితి నెలకొని ఉందన్నారు. 2024 లో నీట్ పరీక్షలకు డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించి పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని వ్యక్తిని చత్తీస్ గడ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారంటే అక్రమార్కులకు బిజెపి ఎంత అండగా నిలుస్తుందో అర్థమవుతోందన్నారు.
ఇప్పటికైనా నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి ఇందుకు కారణమైన అసలు దోషులను పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలగురవం బాబు, పీసీసీ జనరల్ సెక్రటరీ తమటం వెంకట నరసింహులు, పీసీసీ కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, నెల్లూరు జిల్లా ఇన్ చార్జ్ మాంగాటి గోపాల్ రెడ్డి, మాజీ తిరుపతి నగర కాంగ్రెస్ అధ్యక్షులు యార్లపల్లి గోపి, పుంగనూరు నియోజకవర్గం ఇన్ చార్జ్ మురళి మోహన్ యాదవ్, చంద్రగిరి నియోజకవర్గం ఇన్ చార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి, అలాగే నాయకులు తలపా దామోదర్ రెడ్డి, చిత్తూరు శివ శంకర్, మాజీ ఎస్సి విభాగం అధ్యక్షులు, యన్ ఎస్ యూ ఐ తిరుపతి జిల్లా అధ్యక్షులు శివ బాలాజీ, మూసినా భేగం, తిరుపతి జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు, అమూరి కృష్ణమూర్తి, తిరుపతి నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, బోయన నరేంద్ర బాబు, పీసీసీ యస్సి విభాగం కోర్డినేటర్, బాలకృష్ణ, మాజీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమృత్ తెజ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.