
బడిబాట షెడ్యూల్ ను ప్రభుత్వం పునః పరిశీలించాలి_తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్.
వనపర్తి :
తెలంగాణ రాష్ట్రంలో సెన్సెస్ సర్వే మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఉన్నది.ఈ సర్వేలో ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు 90% పాల్గొంటున్నారు. బడిబాట షెడ్యూల్ కూడా మే 14 నుండి జూన్ 19 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. కావున ఉపాధ్యాయులు అందరూ సెన్సెస్ సర్వేలో ప్రతి ఊరిలో చేస్తున్నారు కావున బడిబాట షెడ్యూల్ ను పరిశీలించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఉపాధ్యాయులు ఒకేసారి రెండు కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టతరం. ఇద్దరు ఉపాధ్యాయులు ఒకే పాఠశాలలో ఉంటే సెన్సస్ సర్వేలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు కావున బడిబాట కార్యక్రమాన్ని ఎలా నిర్వహించడం జరుగుతుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జయశంకర్ బడిబాట షెడ్యూల్ను పునర్ పరిశీలించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాములు, తిరుపతయ్య, జిల్లా కార్యదర్శి మనోహర్ జిల్లా కార్యవర్గ సభ్యులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.