వరి ధాన్యాన్ని దించుకోవడానికి రైస్ మిల్లర్లు సహకరించాలని ఆదేశించిన….. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

TEJA NEWS

వరి ధాన్యాన్ని దించుకోవడానికి రైస్ మిల్లర్లు సహకరించాలని ఆదేశించిన….. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

వనపర్తి :
జిల్లాలోని రైస్ మిల్లర్లు వరి ధాన్యాన్ని దించుకోవడంలో ప్రభుత్వానికి సహకరించి, సమన్వయంతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.

కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వరి ధాన్యం నిల్వ కోసం అదనపు స్థలాల అంశంపై అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు వచ్చిన నేపథ్యంలో వరి ధాన్యం నిల్వ కోసం అదనపు స్థలం అవసరం ఏర్పడుతోందని తెలిపారు. కాబట్టి జిల్లాలోని రైస్ మిల్లర్లు వరి ధాన్యాన్ని దించుకోవడంలో ప్రభుత్వానికి సహకరించి, అన్లోడ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. మిల్లర్ల వారీగా గోదాములలో ఖాళీ స్థలాలపై చర్చించిన కలెక్టర్ అదనంగా వారికి ధాన్యం బస్తాల కేటాయింపు పై సూచనలు చేసి, వేగంగా దింపుకోవాలని ఆదేశించారు. నిల్వ కోసం అందుకు తగ్గ అద్దె చెల్లించడం జరుగుతుందని తెలిపారు.

డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాథ్, డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లై ఆంజనేయులు, మిల్లర్లు ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top