సిపిఐ ఆధ్వర్యంలో అశ్వారావుపేట పట్టణ కౌన్సిల్ సమావేశం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కమిటీని ఫిబ్రవరి 2025 న ఏర్పాటు చేయడం జరిగింది. 58 సభ్యులతో కూడిన పట్టణ కౌన్సిల్ కు ఈరోజు మొదటి కౌన్సిల్ సమావేశం.టౌన్ సెక్రటరీ నూకవరపు విజయ్ కాంత్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం మాట్లాడుతూ,పట్టణ కౌన్సిల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు పార్టీ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు.వివిధ శాఖలలో ఉన్న శాఖా కార్యదర్శులు వారి శాఖలలో పార్టీ సభ్యత్వాన్ని పెంచే విధంగా పని చేయాలని అదేవిధంగా ప్రజలతో మమేకమై పనిచేస్తూ వారి శాఖలలో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని,పరిష్కారం కానిపక్షంలో సిపిఐ పట్టణ కమిటీ దృష్టికి తీసుకురావాలనీ ఆయన అన్నారు. వచ్చే పంచాయతీ మరియు మునిసిపల్ ఎలక్షన్స్ లో మన అభ్యర్థులను గెలిపించుకునే దిశగా మన అడుగులు ఉండాలని ఆయన అన్నారు.
మునిసిపాలిటీ పంచాయితీ ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో ప్రతి కార్యకర్త, కౌన్సిల్ సభ్యుడు బాధ్యతగా పనిచేసి ఎన్నికలకు సమాయత్తం కావాలి అన్నారు.సిపిఐ మండల కార్యదర్శి గన్నిన రామకృష్ణ మాట్లాడుతూ,ప్రతి ఒక్క కౌన్సిల్ సభ్యులు ఐక్యమత్యంతో గొడవలు పడకుండా పార్టీని ముందుకు నడిపించడానికి పనిచేయాలని అన్నారు.ఏఐటీయూసీ మండల కార్యదర్శి పటాన్ జలాల్ మాట్లాడుతూ,సిపిఐ పార్టీకి ఎంతో చరిత్ర ఉందని,ఎంతోమంది నాయకులు ప్రజా శ్రేయస్సు కోసం ఎన్నో పోరాటాలు చేసి అసువులు బాసారని. వారి స్ఫూర్తితో నూతన నాయకత్వం పనిచేయాలని ఆయన అన్నారు.సిపిఐ పట్టణ కార్యదర్శి నూకవరపు విజయ్ కాంత్ మాట్లాడుతూ, పట్టణ కౌన్సిల్లోని సభ్యులందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని,నూతన నాయకత్వం ఉత్సాహంతో పనిచేసి పార్టీని మరింత ముందుకు నడిపించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి సిపిఐ అశ్వారావుపేట పట్టణ కార్యదర్శి నూకవరపు విజయ్ కాంత్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గన్నిన రామకృష్ణ, అశ్వారావుపేట పట్టణ కార్యదర్శి నూకవరపు విజయకాంత్, ఏఐటియుసి మండల కార్యదర్శి పటాన్ జలాల్,డివిజన్ కమిటీ సభ్యులు జోగిరాజు, పట్టణ సహాయ కార్యదర్శిలు సయ్యద్ జాకీర్,జక్కం బలరాం మరియు పట్టణ కౌన్సిల్ సభ్యులు,ప్రజాసంఘాల నాయకులు చీపుర్ల సత్యవతి.గద్దా సూర్య కుమారి.షేక్ రసూల్ బి.చల్లా రమాదేవి.బద్దె రమాదేవి పాల్గొన్నారు.
