భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
అశ్వరావుపేట మండలం ఆసుపాక పోస్టు మాస్టర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడాని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చే లెటర్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంకు ఎటిఎం కార్డులు, పాస్ బుక్కులు, రాకపోవడంతో కొందరికి అనుమానం వచ్చి ఉద్యోగి గదిలోకి వెళ్లి చూడగా కుప్పలుగా కనిపించడంతో ఆశ్చర్యపోయారు . వీటిపై సదరు ఉద్యోగిని స్థానికులు ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో, వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై అశ్వరావుపేటలోని ప్రధాన తపాల కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
