రాజీవ్ యువ వికాసం స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రేపటితో ముగియనుంది. మొత్తం16.22 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా కమిటీలు పరిశీలన చేపట్టిన అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. రేపు జిల్లాల ఇన్ ఛార్జి మంత్రుల ఆమోదంతో కలెక్టర్లు ఫైనల్ లిస్టును ఖరారు చేయనున్నారు. జూన్ 2 నుంచి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది 5 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
