టీడీపీ కార్యాలయంపై దాడి – మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు

TEJA NEWS

టీడీపీ కార్యాలయంపై దాడి – మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు

Alla Ramakrishna Reddy: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ దాడి కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరును 127వ ముద్దాయిగా సీఐడీ పోలీసులు చేర్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2021, అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై ఆ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు

అయితే అప్పుడు పోలీసులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఈ దాడి కేసును సీఐడీకి అప్పగించింది. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌, విజయవాడ తూర్పు వైఎస్సార్సీపీ ఇన్​ఛార్జ్ దేవినేని అవినాశ్‌ ఆధ్వర్యంలోని ముఖ్యనేతల ఆదేశాలతో ఈ దాడికి పథక రచన జరిగినట్లు సీఐడీ గుర్తించింది

ఈ దాడి ఘటనపై మంగళగిరి పోలీసులు చర్యలు తీసుకోకపోగా టీడీపీ ముఖ్య నేతలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసుల నుంచి ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. దీంతో కేసులో కదలిక వచ్చింది. గతంలో అరెస్టైన, విచారణకు హాజరైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా సజ్జల రామకృష్ణారెడ్డిని ఏ-120గా చేసిన సీఐడీ పోలీసులు రెండు వారాల కిందట గుంటూరు ప్రాంతీయ సీఐడీ కార్యాలయంలో విచారించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయటం గమనార్హం.
1

You cannot copy content of this page

Scroll to Top