సూర్యాపేటలో శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
సూర్యాపేటలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 16 నెలల మగశిశువును గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుంచి శిశువులను తీసుకువస్తూ ఒక్కో శిశువును రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది..
