ఆల్విన్ కాలనీ డివిజన్ నుండి జైహింద్ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో తరలివెళ్లిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
ఆపరేషన్ సిందూర్ ను రాజకీయంగా వాడుకుంటున్న బీజేపీని ఎండగట్టడం, భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ పై ట్రంప్ వ్యాఖ్యలకు మౌనంగా ఉన్న ప్రధాని మోడీ తీరును విమర్శించడం, సైనికులకు సంఘీభావం తెలపడమే లక్ష్యంగా ఏఐసీసీ(AICC) ఇచ్చిన పిలుపు మేరకు బాచుపల్లి రోడ్డులో నిర్వహిస్తూ ముఖ్యఅతిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొంటున్న జైహింద్ యాత్ర మరియు సభ కార్యక్రమానికి 124 ఆల్విన్ కాలనీ డివిజన్ తరపునుండి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లతో కలిసి పాల్గొనడం జరిగింది.
