సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీలో పదిహేను లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఎఇ శ్రావణి తో కలిసి పరిశీలించడం జరిగింది. కాలనీ లో కొన్ని ఇండ్లు తక్కువ ఎత్తులో ఉండడంతో రోడ్డు నిర్మిస్తే హైట్ పెరిగి వర్షాకాలంలో ఇబ్బంది అవ్వుతుందని కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ వరద నీరు ఇండ్లలోకి చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకొని సీసీ రోడ్డు నిర్మించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, మల్లేష్, ముజీబ్, ఫారూఖ్, ఖలీమ్, రాజుగౌడ్, శ్రీను, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
