ఆరోగ్య రక్ష సీఎం సహాయనిధి… కుత్బుల్లాపూర్ పేద ప్రజల రక్షకులు, మా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ : బిఆర్ఎస్ పార్టీ నాయకులు
చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 – చింతల్ డివిజన్ ఎన్.ఎల్.బి నగర్ ప్రాంతానికి చెందిన వీర వీరరాజు (59), ఆర్. బిక్షపతి (58) ల,
126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూం నగర్ కు చెందిన వై.ఆదిలక్ష్మి (54) ల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని అనుచరుల ద్వారా తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వైద్య సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులు వీర వీరరాజు, ఆర్. బిక్షపతి, వై.ఆదిలక్ష్మిలకు ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి 4.35 లక్షల రూపాయల విలువ గల ఎల్ఓసీ మంజూరు చేయించగా చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితులకు స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఎల్వోసీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ఆపదలో ఉన్నామని ఇంటి తలుపు తట్టిన ప్రతీ ఒక్కరిని నేనున్నానంటూ అభయాన్నిస్తూ ఆదుకునే నాయకుడు బిఆర్ఎస్ పార్టీ విప్, మా నాయకులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అని, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎదురుచూసేవారు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కెపి.వెంకటేష్ గౌడ్, ప్రభాకర్ గుప్తా, బస్వరాజు, రాచకొండ మురళి, రత్నం, శ్రీశైలం యాదవ్ విశ్వనాథ్ గుప్తా, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
