రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ కు సన్మానం

TEJA NEWS

రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ కు సన్మానం

తిరుపతి: ఎ.పి. మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరి రావు కు శనివారం స్విమ్స్ లో ఘనంగా సన్మానించారు. మధ్యాహ్నం 3 గంటలకు స్విమ్స్ పాత డైరెక్టర్ కార్యాలయంలో స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఆధ్వర్యంలో ఈ సన్మానం జరిగింది. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి. కుమార్ మాట్లాడుతూ.. తిరుపతికి చెందిన ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్. శ్రీహరి రావు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా నియమితులయ్యారని, రేడియాలజి విభాగంలో విశిష్ట అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహరి రావు మన స్విమ్స్ హాస్పిటల్ లో కూడా కొంత కాలం పనిచేసారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కౌన్సిల్ సభ్యులలో శ్రీహరి రావు ఒకరిగా వుండటం సంతోషదాయకమని, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎ.పి. నర్సింగ్ హోమ్స్ అండ్ హాస్పిటల్స్ అసోసియేషన్ కు నాయకత్వం వహించారని చెప్పారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిభిరాలలో పాల్గొన్నారని. తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అవర్ణ ఆర్ బిట్లా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్.ఎం.ఓ. డాక్టర్ వెంకట కోటిరెడ్డి, వివిధ విభాగాల విభాగాధిపతులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top