బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి రూ.కోటి నగదు బహుమతి!

TEJA NEWS

బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి రూ.కోటి నగదు బహుమతి!

తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందచేశారు. తెలంగాణ ఉద్యమం లో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు కళాకారులు సాహితీవేత్తలు తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ముఖ్యమంత్రి ప్రకటించారు. అప్పుడే పేర్లు ప్రకటించారు.

వారందరికీ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నగదు పురస్కారం అందించారు. ఎక్కా యాదగిరి రావు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి నేరుగా కోటి నగదు చెక్ ను అందుకున్నారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్,బండి యాదగిరి కుటుంబ సభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. ప్రజాకవి గోరటి వెంకన్న కార్యక్రమానికి హాజుర కాలేదు. కానీ ఆయన కుమార్తె ఆయన తరపున చెక్ అందుకున్నారు.

గోరటి వెంకన్న ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. పురస్కారం ప్రకటించినప్పుడు కేసీఆర్ అనుమతితో తీసుకుంటానని చెప్పారు. రూ.కోటి తీసుకోవద్దని చెప్పలేకపోయారు. ఆయననేరుగా తీసుకోకపోయినా కుమార్తెను పంపించారు. మరోవైపు తాను అవార్డును తిరస్కరించానని గతంలో నందిని సిధారెడ్డి చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు అభినందించి వచ్చారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాత్రం తిరస్కరించలేదు.

You cannot copy content of this page

Scroll to Top