తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని విజయ నగర్ కాలనీ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అధ్యాపక బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ఉపాధ్యాయులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.
కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, జి.ప్రభాకర్, కృష్ణవేణి స్కూల్ ప్రిన్సిపల్ రాధారెడ్డి, ఉపాధ్యాయులు పద్మ కిరణ్మయి, దివ్య, బేబీ దుర్గా భారతి, ఈశ్వరి, జ్యోతి, మమత, స్వప్న, సంధ్య, సరిత, కృష్ణవేణి, జ్యోష్ణ, వరలక్ష్మి, జీనత్, పావని, సత్యనారాయణ, రాధాకృష్ణ, అస్లాం, శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
