తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ లోని బహుదూర్ పల్లి చౌరస్తాలో మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతు ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై పని చేయాలన్నారు. ఈ యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆర్థిక మరియు సాంకేతిక అభివృద్ధి తాలూకు శక్తివంతమైన ఆధునిక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది.
తెలంగాణ ప్రజలు పురోగతి, శ్రేయస్సు మార్గంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రవణ్ కుమార్, మాజీ వైస్ చైర్మన్ జయరామ్, మాజీ కార్పొరేటర్ పాలకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ అవిజే జేమ్స్, బొంగునూరు కిషోర్ రెడ్డి, సక్కడి రంగయ్య, కృష్ణమూర్తి, పరశురామ్ గౌడ్, వేణు కుమార్, కరోల్ల సదానందం, జక్కుల మల్లేష్ యాదవ్, పోలీస్ జివెందర్ రెడ్డి, బెంబిడి మల్ల రెడ్డి, సిద్దనోళ్ల సంజీవరెడ్డి, నాగభూషణం, ధర్మారెడ్డి, డివిజన్ అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఎండి లయక్, గణేష్, పెరిక శివ, పండరి, సంతోష్ ముదిరాజ్, సోమన్న గారి శ్రీధర్ రెడ్డి, ఎండి జాకీర్, బేకు శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షురాలు స్వాతి, సుజాత యాదవ్ మరియు కార్యకర్తలు భారీ ఎత్తున్న పాల్గొన్నారు.
