తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

TEJA NEWS

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తో కలిసి హాజరైన టిపిసిసి ఉపాధ్యక్షులు,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి .

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం పోట్రు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు,టిపిసిసి ఉపాధ్యక్షులు,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్,మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బోంగునూరి శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి తో కలిసి హాజరై అంతాయి పల్లి లోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,ప్రసంగించారు.

అదేవిధంగా ముఖ్య అతిథి చేతుల మీదుగా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు,క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు,జిల్లాలో 10 వ తరగతి ఉత్తీర్ణతలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు,జిల్లా రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి,కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి,డీసీపీ కోటి రెడ్డి,జిల్లా విద్యాశాఖాధికారి విజయ్ కుమారి ,జిల్లా అధికారులు,శామీర్ పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాష్కీ శంకర్ గౌడ్ ,కీసర మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోల కృష్ణ యాదవ్ , మండల్ మున్సిపల్,మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top