ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 23 వినతులు. కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 23 వినతులు వచ్చాయని కమిషనర్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా నలుగురు తమ సమస్యలు తెలుపగా, 19 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. బక్రీద్ కు ఈద్గా మైదానంలో ఏర్పాట్లు చేయాలని కార్పొరేటర్ ఎస్.కి.బాబు కోరారు.
కాగా ఎస్.ఎల్.వి.నగర్ నందు అక్రమ నిర్మాణాలు అరికట్టాలని, 6,7 వార్డుల్లో మెప్మా సంఘాలు జరిపేందుకు గదులు కేటాయించాలని, కె.బి.లే ఔట్ నందు ఆకతాయిల ఆగడాలు అరికట్టాలని, యు డి ఎస్ ఓవర్ ఫ్లో అరికట్టాలని, టిడిఆర్ ఇప్పించాలని, ఎమ్మార్ పల్లి 80 అడుగుల రోడ్డులో రోడ్డుపై వ్యాపారాలు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కరించాలని, గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద రోడ్డుపై వాహనాలు ఆపుతున్నారని, ఉప్పంగి హరిజనవాడలో ఆక్రమణలు అరికట్టాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఫైర్ డి.ఈ.లు, ఏసిపి లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.

