బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆలోచన విధానం, ఎందరో అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు

TEJA NEWS

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆలోచన విధానం, ఎందరో అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ గ్రామంలోని సీనియర్ సిటిజన్స్ కార్యాలయం నందు జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచన విధానం, రాష్ట్ర సాధన సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అడుగడుగునా వివక్షతకు గురై, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ నీళ్లు, నిధులు, నియామకాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా దేశ తలసరి ఆదాయాన్ని మించిన ఆదాయంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపిన గొప్ప నాయకుడు, బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర అపర భగీరథులు కేసీఆర్ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సింహా రెడ్డి, సలహాదారులు బల్వంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం, కోశాధికారి మురళీ గౌడ్, ఉపాధ్యక్షులు లింగం గౌడ్, నాగేష్ కుర్మ, నరహరి గౌడ్, జాయింట్ సెక్రటరీ ఆకుల సందీప్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బిక్షపతి గౌడ్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, గుమ్మడి మధుసూదన్ రాజు, యేసు, ఆటో బలరాం, కాలే నాగేష్, సమ్మయ్య నేత, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎల్లా గౌడ్, కాలే గణేష్, నారాయణ, కుంట వేణు, విజయ్ హరీష్, సత్య నారాయణ యాదవ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top