తనదైన దార్శనిక పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి

TEJA NEWS

తనదైన దార్శనిక పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రపథాన నిలిపిన గొప్ప నాయకులు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జంట సర్కిల్ కార్యాలయిన కుత్బుల్లాపూర్, గాజుల రామారం సర్కిల్ కార్యాలయాల్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….అడుగడుగునా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తూ ఉద్యమమే ఊపిరిగా కేంద్రంతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని తనదైన దార్శనిక పాలనతో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెం.1గా అభివృద్ధి చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉప కమిషనర్లు నర్సింహా, మల్లారెడ్డి, కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, హేమలతా సురేష్ రెడ్డి, ఈఈ లక్ష్మీ గణేష్, కిష్టప్ప, డీఈ లు పాపమ్మ, శిరీష, రూపాదేవి, వివిధ విభాగాల అధికారులు, స్థానిక నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top