విద్యార్థిని హర్షిత కు సత్కారం

TEJA NEWS

విద్యార్థిని హర్షిత కు సత్కారం…

ప్రతిభకు నగదు బహుమతి ప్రోత్సాహం…


మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఏపీఎస్పీ కి చెందిన డీ హర్షిత అనే విద్యార్థినికి మంగళగిరి గివింగ్ బ్యాక్ టు సొసైటీ(జీబీఎస్) ఆధ్వర్యంలో 10 వేల రూపాయల నగదు ప్రోత్సాహ బహుమతి అందజేశారు. కమిషనర్ అలిమ్ భాషా చేతుల మీదుగా విద్యార్థిని హర్షితకు నగదు చెక్కు అందజేశారు. అదే విధంగా ఏపీఎస్పీ బెటాలియన్ లోని కమాండెంట్ క్యాంప్ కార్యాలయంలో కమాండెంట్ కే నగేష్ బాబు, అడిషనల్ కమాండెంట్ డీ ఆశీర్వాదం, విద్యార్థిని హర్షితను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ యు రవి, పీవీ హనుమంత్, కె వెంకటేశ్వరరావు, డీవీ రావు, మురళీ కృష్ణ, పాల్గొన్నారు. కాగా విద్యార్థిని హర్షిత తండ్రి కోటేశ్వరరావు బెటాలియన్ లో ఎమ్టీ గ్రూపులో పని చేస్తున్న నేపథ్యంలో ఎమ్టీఓ ఆర్ఐ బీ వెంకట్రావు గ్రూప్ తరపున విద్యార్థిని హర్షితను అభినందించారు.

You cannot copy content of this page

Scroll to Top