మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి
ఏపీఎం భాష పాక చంద్రశేఖర్
నల్లగొండ: ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని మాడుగుల పల్లి మండలం ఏపిఎం భాష చంద్రశేఖర్ తెలిపారు.బుధవారం నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం పాములపహాడ్ గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థిని,విద్యార్ధులకు మహిళా సంఘాలలోని మహిళా టైలర్స్ చేత స్టిచ్చింగ్ చేపించిన స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులలోని టైలర్స్ ని గుర్తించి వారిచే విద్యార్థిని విద్యార్థి వారీగా కొలతలు తీపించి యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది స్కూల్ వారీగా మహిళా టైలర్స్ ని మ్యాచింగ్ బ్యాచింగ్ చేయడం జరిగింది తద్వారా మహిళలకు జీవానోఫాది కల్పించడంతో పాటుగా అదనపు ఆదాయం సంకుర్చాలనే ఉద్దేశ్యం తో ఈపని అప్పజెప్పినట్లుగా తెలియజేశారు మండలంలోని (40) ప్రభుత్వ స్కూల్స్ తో పాటు కేజీబీవీ స్కూల్&కళాశాల మొత్తం మండలంలో (1533) యూనిఫామ్స్ స్టిచింగ్ కంప్లీట్ చేపించడం జరిగింది రేపు అన్ని స్కూల్స్ కు హ్యాండోవర్ చేయడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీసీ పుట్టల నాగయ్య,స్కూల్ హెడ్మాస్టర్ ఎన్ లక్ష్మారెడ్డి,గ్రామ సంఘం అధ్యక్షురాండ్లు(అమ్మ ఆదర్శ పాటశాల కమిటీ చైర్పర్సన్స్) దుర్గం లక్ష్మీ, యాతం మణెమ్మ వివో ఏలు యాదమ్మ,పావని సిఆర్పి ఈ పీ లు ఉషా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
