గిరిజన రైతులను ఇబ్బంది పెడుతున్న వనపర్తి జిల్లా ఫారెస్ట్ అధికారి పై జాతీయ ఎస్టీ కమిషన్

TEJA NEWS

గిరిజన రైతులను ఇబ్బంది పెడుతున్న వనపర్తి జిల్లా ఫారెస్ట్ అధికారి పై జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు…………….
బంజార గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్

, వనపర్తి మండలం పెద్ద గూడెం తండా గిరిజన రైతులను ఇబ్బందులకుగురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మంగళవారం బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ను ఢిల్లీలో కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా శివ నాయక్ మాట్లాడుతూ జాతీయ ఎస్టీ కమిషన్ ఫిర్యాదుకు సానుకూలంగా స్పందించి త్వరలోనే వనపర్తి జిల్లా ఫారెస్ట్ అధికారిపై నోటీసులు పంపిస్తామని తెలపడం జరిగింది అని శివ నాయక్ ఓ పత్రిక ప్రకటనలు తెలిపారు
, వనపర్తి మండలం పెద్దగూడెం తాండ గిరిజన రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అటవీ భూమికి ఆనుకొని దగ్గరలో ఉన్న గిరిజన రైతుల వ్యవసాయ భూమి దగ్గరికి గిరిజన రైతులను వెళ్ళనీయకుండా ఆపుతూ రైతులపై దాడిలకు దిగుతు ఇబ్బందులు పెడుతు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని
చాలా సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నందుకు కొంతమంద గిరిజన రైతులకు ప్రభుత్వాలు పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంకా 58 మందికి గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం దగ్గర పెండింగ్ లోనే ఉన్నది అట్టి పోడు భూముల్లో కూడా గిరిజన రైతులకు రానివ్వకుండా ఫారెస్ట్ ఆఫీసర్ P రాణి, రేంజ్ ఆఫీసర్ నిఖిల్ రెడ్డి కలిసి దాదాపు 80 సంవత్సరాల నుండి గిరిజన రైతుల ఆధీనంలో ఉన్న భూములపై గిరిజన రైతులను సాగు చేయకుండా ,వెళ్ళనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని గిరిజన మహిళలు అక్కడికి వెళ్తే కూడా వారిని బూతులు తిడుతూ లంబాడి ముండల్లారా అని పచ్చి బూతులు తిడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఈ విషయంపై రూరల్ ఎస్సై డిఎస్పి జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు అని
కావున గిరిజన రైతులపై బూతులు తిట్టిన ఫారెస్టర్ ఆఫీసర్ పి. రాణి పై మరియు రేంజ్ ఆఫీసర్ నిఖిల్ రెడ్డి పై చర్యలు తీసుకొని ఎస్సి ఎస్టి అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకొని గిరిజన రైతులకు న్యాయం చేయాలని శివ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో కోరినట్లు పత్రికా ప్రకటనలో తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top