సహాయ బీసీ అభివృద్ధి అధికారి ఆంజనేయులు కి రాచాల సన్మానం
వనపర్తి
వనపర్తి జిల్లా సహాయ బీసీ అభివృద్ధి అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆంజనేయులు సాగర్ ని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఘనంగా సన్మానించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ ఆంజనేయులు సాగర్ గత 13 ఏళ్లుగా బీసీ హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తున్నారని, విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకునే వ్యక్తిత్వం గలవారని, ఎంతో మంది పేద విద్యార్థులను చేరదీసి ఉన్నతంగా తీర్చిదిద్దాడన్నారు.
ఎంతో నిజాయితీ, నిబద్ధత కలిగిన ఆయన ప్రమోషన్ పొంది సహాయ బీసీ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని, ఇకపై జిల్లాలోని హాస్టల్ విద్యార్థులకు వసతి, భోజనం తదితర విషయాల్లో ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాడన్న నమ్మకం తమకుందన్నారు.
ప్రభుత్వం బీసీలకు అందిస్తున్న పథకాల విషయంలో అవగాహన కల్పించి వారి అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షుడు ధర్మేంద్ర సాగర్, ప్రధాన కార్యదర్శి అస్కని రమేష్, నాయకులు దివాకర్ గౌడ్, అరవింద్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
