అయ్యప్ప ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన దేవరకద్ర శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి

TEJA NEWS
  • అయ్యప్ప ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన దేవరకద్ర శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి

    వనపర్తి జిల్లాలోని
    కొత్తకోట పట్టణం లో సర్వాంగ సుందరంగా అత్యంత ఎత్తైన అయ్యప్ప విగ్రహ ఏర్పాటుతో నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా నిర్మాణ పనులు జరగటం సంతోషకరమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రారంభం మొదటి నుండి ఆలయ నిర్మాణ పనులలో ఎమ్మెల్యే ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటూ నిర్మాణానికి కావలసిన మెటీరియల్ ను సమకూరుస్తూ వస్తున్నారని. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతీ అవసరానికి ఆసరాగా ఉండి త్వరితగతిన ఆలయం నిర్మాణం పూర్తి చేసేలా కృషి చేస్తానని అన్ని విధాలా తమ సహకారం పూర్తిగా ఉంటుందని ఆలయ నిర్వాహకులకు తెలిపారు.

అయ్యప్ప సేవాసమితి తరపున ఎమ్యెల్యే కి ఉమ్మడి జిల్లా గురుస్వామి శ్రీ గోపాలకృష గురుస్వామి గారు స్వాగతం పలికి నిర్మాణ పనులగురుంచి వివరించారు అనంతరం సేవాసమితి అధ్యక్షులు ధూపం నాగరాజు కమిటీ సభ్యులు బలిజ లింగేశ్వర్ , విశ్వనాథం గంగాధర్ , వేముల సుధాకర్ రెడ్డి , సత్యం సాగర్ , నాగరాల శివకుమార్ రెడ్డి , వేముల సంతోష్ రెడ్డి , భాస్కర్ రెడ్డి , భీమ కిషోర్ ల ను శాలువాతో సన్మానించి ధన్యవాదములు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top