కొడాలి నాని అరెస్ట్ పై క్లారిటీ ఇచ్చిన పోలీసులు

TEJA NEWS

కొడాలి నాని అరెస్ట్ పై క్లారిటీ ఇచ్చిన పోలీసులు

మాజీ మంత్రి కొడాలి నాని(Former Minister Kodali Nani) అరెస్ట్ నిరాధారమని ఏపీ పోలీసులు(AP Police) తెలిపారు. ఆయన్ను కోల్ కతా ఎయిర్ పోర్టు(Kolkata Airport)లో అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తలు నిరాధారమైనవని వెల్లడించారు.

ఆ ప్రచారంలో నిజం లేదని తెలిపారు. కొడాలి నాని అరెస్ట్ చేస్తే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. కొడాలి నానిపై రాష్ట్రంలో కేసు నమోదు అయిన నేపథ్యంలో ఆయన్ను కోల్‌కతా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు ఈ ఉదయం నుంచి వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. దీంతో ఏపీ పోలీసులు స్పందించారు.

కొడాలి నానిని అరెస్ట్ చేశామన్నది ప్రచారం మాత్రమేనని, నిజం కాదని తెలిపారు. అయితే ఆయనపై పలుచోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో కొడాలిపై లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top