ప్రభుత్వ ఇంటర్ బోర్డు గుర్తింపు లేకుండా తరగతులు

TEJA NEWS

ప్రభుత్వ ఇంటర్ బోర్డు గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ కళాశాల పై చర్యలు తీసుకోవాలి

అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతూ వేల రూపాయలు సొమ్ముచేసుకుంటున్న చిలకలూరిపేట లోని SRI CHAITANYA SCHOOL కళాశాల పై చర్యలు తీసుకోవాలి

*ఏఐఎస్ఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి : మేకపోతుల నాగేశ్వరావు

అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏఐఎస్ఎఫ్ పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో చిలకలూరిపేట నగరంలో ఉన్న SRI CHAITANYA కళాశాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి మేకపోతుల నాగేశ్వరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ చిలకలూరిపేట నగరంలో లోని ప్రైవేట్ కళాశాల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా పాఠ్య పుస్తకాలను వేల రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న నారాయణ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి , అధిక ఫీజుల దోపిడీలకు పాల్పడుతున్నారు అని తెలిపారు . తక్షణమే విద్యాశాఖ అధికారులు
(MEO) స్పందించి అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న SRI CHAITANYA యాజమాన్యం పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఇంటర్ బోర్డు పర్మిషన్ లేకుండా ఇన్ని రోజులు కళాశాల నిర్వహిస్తున్న MEO ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని తెలిపారు. ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పై , ఫీజుల దోపిడీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి కల్లబొల్లి మాటలు చెప్పి అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తక్కువ రేట్ లో దొరికే విద్యార్థుల పుస్తకాలను వారి కళాశాల పేరును ముద్రించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే SRI CHAITANYA కళాశాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కార్యదర్శి : మేకపోతుల నాగేశ్వరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు : దాసరి హేమంత్ కుమార్, నాయుడు: సాయి శ్రీనాధ్, తెల్లభటి : సాహిత్ కుమార్, తెల్లభటి: పవన్,మేకపోతుల:మధు, కంచర్ల :లిఖిత్, కంచర్ల: చరణ్, మేకపోతులు: హర్ష, పాతపట్నం:గోపి,అన్నం:శ్రీనివాస్
యస్వంత్ రాజేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top