పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతి — సి.ఎం.ఆర్.ఎఫ్. పథకం : ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం 129వ డివిజన్ పరిధిలోని టీఎస్‌ఐఐసీ కాలనీకి చెందిన రామచందర్ , వయసు – 57, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుండగా, మెరుగైన వైద్య చికిత్స కోసం వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ని సంప్రదించారు. ప్రజా సంక్షేమాన్ని ప్రథమ ప్రాముఖ్యతగా తీసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించగా, ఈరోజు స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ఎల్.ఓ.సి.చెక్కును లబ్ధిదారుడు రామచందర్ కుటుంబానికి చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – అవసరమైన, అర్హులైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలనే లక్ష్యంతో సి.ఎం.ఆర్.ఎఫ్. పథకం అమలవుతోందని, నిత్యం ప్రజల పక్షాన నిలబడి పేదప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే నాయకుడు మా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అని, అర్హులైన ప్రతీ ఒక్క నిరుపేద సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎండీ సిద్దిక్, నాయకులు చెక్కా సురేష్, హెచ్.ఎ.ఎల్. బషీర్ తదితరులు పాల్గొన్నారు
