బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుందాం

TEJA NEWS

బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుందాం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ …

బోనాల పండుగ ఉత్సవాల ఏర్పాట్ల నిధులకోసం దరఖాస్తుల స్వీకరణ.

తెలంగాణలో విశేషమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా బోనాల పండుగను ప్రతి ఏటా ప్రజలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆలయాలకు నిధులు మంజూరు చేస్తోందని ఆయన తెలిపారు.

అర్హత (రిజిస్ట్రేషన్) కలిగిన ఆలయ కమిటీలకు నిధుల కోసం దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోగా చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు.

దరఖాస్తుతో పాటు
1) కమిటీ లెటర్‌ప్యాడ్,
2) బ్యాంక్ ఖాతా వివరాలు,
3) సభ్యుల ఆధార్ కార్డు ప్రతులు,
4) ఆలయానికి సంబంధించిన 3 ఫొటోలు…
5) ప్రతీ కాపీ పై కమిటీ స్టాంపు ముద్రించి జతపరచాలని సూచించారు.

గమనిక: దరఖాస్తుల చివరి తేదీ 25 జూన్.

ఇట్లు,
ఎమ్మెల్యే కార్యాలయం,
చింతల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.

You cannot copy content of this page

Scroll to Top