సమీకృత వ్యవసాయ సాగు పద్దతిని పరిశీలించిన : కలెక్టర్ తేజస్
సూర్యాపేట జిల్లా: ఆయిల్ పామ్ సాగు చేయటం ద్వారా అత్యధిక లాభాలు పొందవచ్చు అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చివ్వెంల మండలము బి.చందుపట్ల గ్రామం లో గల మార్కాల వెంకట రెడ్డి ఆయిల్ పామ్ తోటను సందర్శించారు. ఈ సంధర్భంగా ఆయిల్ పామ్ సాగు వివరాలను, వారి క్షేత్రం లొ ఆయిల్ పామ్ తో పాటు మామిడి, కొబ్బరి, అన్నీ రకాల పండ్లు, నాటు కోళ్ళు మరియు గొర్రెల లను సమీకృత పద్దతిలో సాగు విధానం గురించి రైతు నుండి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఆయిల్ పామ్ సాగులో తీసుకోవాలిసిన యాజమాన్యంపై పలు సూచనలు చేశారు. జిల్లా లో ఆయిల్ పామ్ గెలల కోతలు ప్రారంభమైనందున ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకై అంధిస్తున్న ప్రోత్సాహకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయిల్ పామ్ ను సాగు చేయవలసిందిగా జిల్లా రైతులకు కలెక్టర్ సూచించారు. సూర్యాపేట జిల్లాలో నాలుగేండ్ల క్రితం సాగు చేసిన ఆయిల్ పామ్ పంట చేతికి వస్తుండడం అలాగే గెలల ధర భారీగా పెరగడంతో రైతుల్లో నూతన ఉత్సాహం నెలకొంటోందని ఇన్నాళ్లు ఎప్పుడో నాలుగేళ్ళకి వచ్చే పంట కోసం ఇప్పటినుండే కష్టపడి సాగు చేయాలనుకున్న రైతులు కూడా ఇప్పుడు ఆయిల్ పామ్ ను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని దీంతో జిల్లాలో సాగు పెరుగుతున్నదని తెలిపారు.జిల్లాలో ప్రస్తుతం 4885 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుందని ఆయిల్ పామ్ పథకంలో పెట్టిన టార్గెట్ లో ఇప్పటి వరకు సుమారు 400 ఎకరాల్లో తాజాగా పంట చేతికి వస్తుండడంతో పంటను చూసిన ఇతర రైతులు ఆయిల్ పామ్ సాగుకు ఆకర్షితులవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిం చేందుకు పలు చర్యలు తీసుకుంటోందని దిగుబడి వచ్చేంత వరకు అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. వరి, పత్తి పంటలతో పోల్చితే రైతులు తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో మంచి లాభాలు సాధించే అవకాశం ఉందని దీంతో గత నాలుగేండ్లుగా జిల్లాలో ఆయిల్ పామ్ గణ నీయంగా పెరుగుతోందని
ఆయిల్ పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుందని నాటిన నాలుగో యేడు నుంచి పంట చేతికి వస్తుందని మొదటి నాలుగేండ్ల వరకు ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు భరిస్తున్నదని కలెక్టర్ అన్నారు.మొదటి మూడేండ్లు మొక్కజొన్న, పత్తి, వేరుశనగ లాంటి పంటలను అంతర పంటగా సాగు వేసుకోవ చ్చని నాలుగోయేడు నుంచి పంట ఎకరాకు కనీసం 8-10 టన్నులకు తక్కువ కాకుండా దిగుబడి వస్తుందని చెట్టు పెరిగే కొద్దీ మెలకువలు పాటిస్తూ 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి రాబట్టవచ్చని తెలిపారు.
ఆయిల్ పామ్ కు ప్రోత్సాహం వరి, ఇతర సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులకు లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు.నూనె వినియోగానికి తగినట్టు పంట లేకపోవడంతో ఏటా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఫలితంగా ఆదాయం కోల్పోవడంతో పాటు అధిక ధరలకు నూనెలను కొనుగోలు చేయాల్సి వస్తున్నదని దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్రంలో 2020-21 నుంచి ఆయిల్ పామ్ మిషన్ కొనసాగుతోందని అన్నారు. రైతులకు రాయితీలు ఇచ్చి సాగును ప్రోత్సహిస్తున్నారని ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు మొదటి నాలుగేండ్లలో అంతర పంటల సాగుకు, కలుపు తీయడానికి, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం ఎకరానికి రూ.4,200 ఆర్థిక సాయం చేయటం జరుగుతుందని మార్కెట్ లో రూ.193 నుంచి రూ.200 ఉండే ఆయిల్ పామ్ మొక్కలను సబ్సిడీతో రూ.20కే రైతులకు అందిస్తోందని అలాగే డ్రిప్ సౌకర్యం కల్పించేందుకు యూనిట్ ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీగా అందిస్తోందని ఒక ఏకరానికి మొత్తం రాయితీ గా రూ. 50,918/- ప్రభుత్వం అంధిస్తున్నదని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.
తుంగతుర్తి మండలం కేశవపురం గ్రామానికి చెందిన శివారులో తూము వెంకన్న, తూము సత్యనారాయణ 14 ఎకరాల విస్తీర్ణంలో గత మూడు సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ సాగు చేయగా మొదటి కోతను 13.06.2025 న కోశారని పంటను తుంగతుర్తి మండల కేంద్రంలో పతాంజలి ఆయిల్ ఫామ్ కంపెనీ వారు ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో రైతు నేరుగా విక్రయించాడని మొదటి కోత లోనే పది టన్నులు దిగిబడి రావడంతొ రైతులు సంతోషంగా ఉన్నారని ప్రస్తుతం టన్ను ధర 18 వేల 748 రూపాయలు ఉండగా పది టన్నులకు గాను ఆ రైతుకు లక్ష 87 వేల రూపాయలు రావడంతొ ఆనంద పడుతున్నారని అధికారులు కలెక్టర్ కి వివరించారు. ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ సంతోష్ కుమార్, ఉద్యానవన డివిజన్ అధికారిణి స్వాతి, మండల ఉద్యానవన అధికారి మహేష్, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు , పతంజలి కంపెనీ ప్రతినిధులు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
