చిన్నారులను అంగన్వాడీలో చేర్పించాలి
అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్- ఇందిర
మూడు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడి స్కూల్లో చేర్పించాలని అంగన్వాడీ టీచర్ కే ఇందిర అన్నారు. బుధవారం కేతపల్లి మండలం గుడివాడ గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించి ఆమె మాట్లాడారు.ఫ్రీ స్కూల్ మెటీరియల్ తో పిల్లలు సరదాగా ఆడుకుంటారని అన్నారు. అంగన్వాడీలో శారీరక మానసిక ఎదుగుదల ఉండే విధంగా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.శిక్షణ పొందిన టీచర్లతో పిల్లల మానసిక ఎదుగుదల ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని వివరించారు. అంగన్వాడి సెంటర్ల లో ఇస్తున్న పోషకాహార పదార్థాలు తీసుకొని పిల్లలు, తల్లులు మంచి ఆరోగ్యం వంతులుగా ఉంటారని వివరించారు.ఈ కార్యక్రమంలో తల్లులు, పిల్లలు, ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు అంగన్వాడీ ఆయా తదితరులు పాల్గొన్నారు
