ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : బాపూజీ
సూర్యపేట: సిరిపురం గ్రామం నడిగూడెం మండలం లో ఆర్.బి.ఐ ఆర్ధిక అక్షయరాష్యత క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు లో చింతల బాపూజీ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మాట్లాడుతూ సిరిపురం గ్రామంలో జంపాల దేవకమ్మ అనే మహిళ గుండె పోటుతో మరణించడం ధ్వారా ఆమెకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన క్రింద వారికీ 2 లక్షల రూపాయలు SBI బ్యాంకు తరుపున రావడం జరిగింది. 2 లక్షల రూపాయలను వారికీ సంబంధించిన నామిని కి ఇవ్వడం జరిగింది. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ చింతల బాపూజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకువాలని ఈ PMJJBY, PMSBY అనే జీవిత భీమా పథకాలను సాధ్వినియోగం చేసుకోవాలని తెలియజేశాయరు. ఈ కార్యక్రమం లో సి.ఎఫ్.ఎల్ కోర్డినేటర్ నాగరాజు , గ్రామ సెక్రటరీ ఉన్నారు.
