నాగమల్లేశ్వర్రావు కుటుంబమేనా… డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడికత్తి శీను కుటుంబాల గుర్తులేవా జగన్ : ప్రత్తిపాటి
- జగన్ నిర్లక్ష్యం.. వైసీపీనేతల పెడధోరణే వృద్దుడు సింగయ్య, మరొకరి చావుకి కారణం :ప్రత్తిపాటి.
- జగన్ ప్రతి ఆలోచన.. ప్రతి అడుగు… ప్రతి వేషం తన కుట్ర రాజకీయాల్లో భాగమే : ప్రత్తిపాటి.
“ జగన్ చెప్పిన మాటలు నమ్మి… “వైనాట్ 175, మనమే గెలుస్తున్నాం… 9వ తేదీనే ప్రమాణ స్వీకారం” అన్న ఆయన అతి ఆత్మవిశ్వాసం చూసి, జగన్ పై ఉన్న వెర్రి అభిమానంతో అప్పులుచేసి మరీ నాగమల్లేశ్వరావు గత ఎన్నికల వేళ వైసీపీ గెలుపుపై భారీస్థాయిలో పందేలు కాసేడు. ఫలితాలు వెలువడ్డాక వైసీపీ ఓటమిపై ప్రజల్లో వ్యక్తమైన హర్షాతిరేకాలను చూసి తట్టుకోలేక, అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రజల నాడిని పసిగట్టలేని జగన్ పిచ్చిఆలోచనలకు అన్యాయంగా నాగమల్లేశ్వరరావు బలైపోయాడు. గతేడాది జూన్ 9న నాగమల్లేశ్వరరావు చనిపోతే, జగన్ కు ఇప్పుడు ఆయన కుటుంబాన్ని పరామర్శించాలనే ఆలోచన రావడం సిగ్గుచేటు. నాగమల్లేశ్వరరావు జగన్ చెప్పినంత అమాయకుడు కాడు. అతనిపై వైసీపీ ప్రభుత్వంలోనే రెండుకేసులు నమోదయ్యాయి.
