సిటీ క్రెడిట్” సంస్థ ప్రారంభం

TEJA NEWS

సిటీ క్రెడిట్” సంస్థ ప్రారంభం

తిరుపతి: తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్(టీసీసీ) కార్యాలయంలో “సిటీ క్రెడిట్” అనే సంస్థను సిటీ యూనియన్ బ్యాంక్ ద్వారా ఏర్పాటు చేసి బుధవారం ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా చిన్న, మధ్యతరగతి వ్యాపారస్తులకు, ఉద్యోగులకు 10 లక్షల నుండి 50 లక్షల వరకు రుణాలను అతి సులభ పద్ధతిలో ఇచ్చుటకు మైక్రో లోన్స్ ను సిటీ యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయానంద్ ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ యూనియన్ బ్యాంక్ అధికారి షౌకత్ అలీ, సిటీ క్రెడిట్ అధినేత కొండేటి రవికుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ పీఆర్వో నరేష్, ఇతర ప్రతినిధులు, తిరుపతి పట్టణంలోని వివిధ వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top